Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలు.. గాలి జనార్ధన్ రెడ్డికి షాక్

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (22:10 IST)
గాలి జనార్ధన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీ సరిహద్దులో గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్‌ అనుమతి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూ జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో.. జగన్ సర్కారు నిర్ణయాన్ని తాము సమీక్షించుకోవాలనుకంటున్నట్లు సుప్రీంకు ఏపీ సర్కారు తెలిపింది. ఈ అభ్యర్థనపై తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
 
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ తవ్వకాల్లో రాష్ట్ర సరిహద్దులు చేరిగిపోవడంతో గతంలో చేపట్టిన తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. సర్వే ఆఫ్ ఇండియా నివేదికకు అనుగుణంగా గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్‌కి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని గతంలో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని మైనింగ్ కంపెనీల న్యాయవాదులు తెలిపారు. 
 
అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం కేసు విచారణ నాలుగు వారాల పాటు జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నేతృత్వంలోని ధర్మాసనం వాయిదా వేసింది. అమికస్ క్యూరీ నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ ఆవిష్కరించిన బ్రహ్మా ఆనందం ట్రైల‌ర్ లో కథ ఇదే

ఓ మంచి దేవుడా.అడగకుండానే అన్నీ ఇచ్చావు అంటూ విక్టరీ వెంకటేష్ ఫిలాసఫీ

పృథ్వీరాజ్‌ లైలా ప్రమోషన్ లో డైలాగ్స్ అన్నాడా, అనిపించారా?

చిరంజీవి - అనిల్ కాంబోలో మెగా చిత్రం... టైటిల్ చెప్పిన దర్శకేంద్రుడు - ఆ పేరు ఇదే...

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments