Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అమ్మ ఒడి" పథకానికి మరో మెలిక... మార్గదర్శకాలివే...

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (16:20 IST)
అమ్మ ఒడి పథకానికి వైకాపా ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. ఈ పథకం కింద విద్యార్థులు లబ్ది పొందాలంటే కనీసం 75 శాతం హాజరు ఉండాల్సిందేనన్న నిబంధన విధించింది. 
 
విద్యాసంవత్సరం మధ్యలోనే చదువును నిలిపివేస్తే(డ్రాపవుట్‌).. సదరు విద్యార్థులను ఈ పథకం నుంచి తొలగించనున్నారు. దీనిని అధిగమించేందుకు పాఠశాలలకు పిల్లలను ప్రతిరోజూ తప్పకుండా పంపాలని ప్రభుత్వం సూచించింది. 
 
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం అమ్మఒడికి మార్గదర్శకాలను జారీ చేశారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
* ఈ పథకం కింద విద్యార్థి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకునికి యేడాదికి రూ.15 వేలు చొప్పున అందిస్తుంది. 
* పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
* దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్‌) ఉన్న కుటుంబం అయి ఉండాలి. కుటుంబానికి తెల్లరేషన్‌ కార్డు ఉండాలి. 
* లబ్ధిదారుడు/తల్లి ఆధార్‌ కార్డును కలిగి ఉండాలి. విద్యార్థులకు ఆధార్‌ కార్డు కచ్చితంగా ఉండాలి.
* తల్లి మరణిస్తే సంరక్షకుడికి రూ.15 వేలు ఇస్తారు. 
* లబ్ధిదారుడి పిల్లలు 1 నుంచి 12 తరగతులలో ఏపీ ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువుతూ ఉండాలి.
* విద్యార్థి కనీసం 75 శాతం హాజరును కలిగి ఉండాలి.
* రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ, పీఎస్‌యూ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ అమ్మ ఒడి పథకానికి అనర్హులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments