ప్ర‌భుత్వంతో ప్ర‌తిష్ఠంభ‌న వ‌ద్దు... అపోహ‌లుంటే మాట్టాడండి...

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (18:46 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వానికి, ఎన్జీవోలకు మ‌ధ్య అగాధం మొద‌ల‌వుతోంది. పిఆర్సి జీవోలు వివాదాస్ప‌దంగా త‌యార‌వుతున్నాయి. పీఆ‍ర్సీ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. అపోహలు ఉంటే కమిటీతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. సోమవారం పీఆర్సీపై మంత్రుల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.
 
 
‘ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రేపు కూడా చర్చలకు రమ్మని పిలుస్తాం. కమిటీని గుర్తించబోమని చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నాం. ఉద్యోగులను చర్చలకు పిలించాం. చర్చలకు ఉద్యోగ సంఘాలు రాలేదు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments