Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు ఆదాయానికి గండి కొట్టారనీ... ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అరెస్టు

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. 
 
ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యనారాయణపై గత నెల 31వ తేదీన విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ఏ5 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏడీజే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అది ఈ నెల 15వ తేదీన తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 
 
ఆయన కోసం విజయవాడతో పాటు విశాఖపట్టణం, ఢిల్లీ సహా పలు నగరాల్లో పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో ఆయన్ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఓ రహస్య ప్రదేశానికి ఆయనను తీసుకెళ్లి విచారిస్తున్నట్టు సమాచారం. అయితే, సూర్యనారాయణ అరెస్టుపై పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

పరిపూర్ణానంద స్వామీజీ అరెస్టు 
 
రాజమండ్రికి చెందిన అనాథ బాలికపై గత యేడాదిగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చిన విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చిన్న వయసులోనే బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో బాలికను చేరదీసిన బంధువులు ఐదో తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం విశాఖలోని కొత్త వెంకోజీ పాళెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. 
 
అక్కడ ఆ బాలికతో స్వామీజీ ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం వంటిపనులు చేయిస్తూ వచ్చారు. రాత్రి సమయంలో తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఇలా ఒక యేడాది కాలంగా ఆ బాలికను తన గదిలోనే గొలుసుతో బంధించాడు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. రెండు చెంచాల భోజనం మాత్రమే పెట్టి కాలకృత్యాలకు కూడా అనుమతించకపోయేవానరని వారానికి ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లనిచ్చేవారన బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ క్రమంలో ఈ నెల 13వతేదీన పన మనిషి సాయంతో ఆ బాలిక ఆశ్రమ నుంచి బయటపడింది. రైల్వే స్టేషన్‌కు చేరుకుని తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కంది. అక్కడ తనకు పరిచయమైన ఓ ప్రయాణికురాలితో తన బాధను చెప్పుకుంది. ఆ మహిళ తనతో పాటు తీసుకెళ్లి రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ హాస్టల్‌లో చేర్పించేందుకు ప్రయత్నిచంగా, హాస్టల్ నిర్వాహకులు మాత్రం పోలీసుల నుంచి అనుమతి లేఖ తెస్తేనే చేర్చుకుంటామని చెప్పారు. దీంతో ఆ బాలికను వెంట బెట్టుకుని బాలల సంక్షేమ కమిటీకి వెళ్ళి తనకు జరిగిన విషయాన్ని వివరించింది. 
 
దీంతో నిర్ఘాంతపోయిన కమీటీ సభ్యులు.. విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు స్వామీజీపై పోక్సో చట్టంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అయితే, ఆ బాలిక చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అంతా అబద్ధమేనని స్వామీజీ కొట్టిపారేసారు. ఆశ్రమ భూములను కొందరు కొట్టేయాలని చూస్తున్నారని, అందులోభాగంగానే తనపై కుట్ర జరిగిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. కాగా, ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్టు ఈ నెల 15వ తేదీన ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments