Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెలకు గుండెపోటు వస్తే.. బసవతారకం ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారు..?

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (18:33 IST)
ఏపీ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మృతి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
ఎవరు దొంగతనం చేయమన్నారు.. ఆత్మహత్య ఎవరు చేసుకోమన్నారు అంటూ ప్రశ్నించారు. కోడెల మృతి బాధాకరం అంటూనే.. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ స్పీకర్ ప్రాణాలు కోల్పోతే ఉపముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 
 
మరోవైపు కోడెల శివప్రసాదరావు మృతిపై న్యాయ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని అయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తొలుత గుండెపోటు అన్నారని, ఆ తరువాత ఆత్మహత్య అంటున్నారని.. కోడెల మృతిపట్ల సమగ్ర విచారణ అవసరమని బొత్స పేర్కొన్నారు. 
 
కోడెలకు ఒకవేళ గుండెపోటు వచ్చి ఉంటే నిమ్స్, కేర్ ఆస్పత్రి, అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని కానీ బసవతారకం హాస్పిటల్‌కు తీసుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. అది క్యాన్సర్ హాస్పిటల్ కదా ? అంటూ ఆయన అడిగారు. ప్రభుత్వం కేసులతో కోడెల శివప్రసాద్ రావును వేధించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించడం కరెక్టు కాదని బొత్త అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments