Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. ఎప్పుడో తెలుసా?

సెల్వి
మంగళవారం, 12 నవంబరు 2024 (16:26 IST)
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో బీజేపీ కోసం ప్రచారం చేయనున్నారు. తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్‌తో ప్రచారం చేయించనుంది. రెండు రోజుల పాటు ప్రచారం చేసేందుకు పవన్ కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమిలో భాగమైన జనసేన.. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తూ ప్రచారం చేయనుంది.
 
పవన్‌తో పాటు మహారాష్ట్రకు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెళ్లనున్నారు. ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు నాదెండ్ల. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. 
 
ఇప్పటికే మ్యానిఫెస్టోలు విడుదల చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 23న ప్రకటిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments