Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలెక్ట్ కమిటీని నియమిస్తావా... చర్యలు తీసుకునేనా... మండలి ఛైర్మన్ హుకుం

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (13:54 IST)
ఎంతో సౌమ్యుడుగా పేరున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌కు ఆగ్రహం వచ్చింది. మండలి కార్యదర్శిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పాటించక పోవడంతో మండలి కార్యదర్శిపై గుర్రుగా ఉన్నారు. తన ఆదేశం మేరకు వెంటనే సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దుకు  సంబంధించిన బిల్లులను శాసనమండలి తిరస్కరించిన విషయం తెల్సిందే. పైగా, ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి మండలి ఛైర్మన్ పంపించారు. అయితే, సెలక్ట్ కమిటీకి సంబంధించి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు పున:సమీక్షించాలంటూ మండలి కార్యదర్శి ఫైల్‌ను వెనక్కి పంపారు.
 
ఈ చర్య పట్ల షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్ నెంబర్ 154 కింద తనకు సంక్రమించిన విచక్షణాధికారాల మేరకు సెలక్ట్ కమిటీని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓటింగ్ సాధ్యంకాదని స్పష్టం చేశారు. సెలెక్ట్ కమిటీని నియమించి, దానికి సంబంధించి ఫైల్‌ను వెంటనే పంపని పక్షంలో అందులో ఉండే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత రాత్రి ఈఫైలింగ్ సిస్టం ద్వారా సెక్రటరీకి షరీఫ్ పంపినట్లు సమాచారం. దీంతో తర్వాత జరిగే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments