ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. ఆయన సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలితారు. ఆ తర్వాత వేదపండితులు ఆయన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆయన మూడింటిపై సంతకాలు చేశారు.
అందులో ఒకటి ఆశా వర్కర్ల నెల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచే ఫైలుపై సంతకం చేశారు. రెండో సంతకం అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు కేంద్ర అనుమతి కోరుతూ సంతకం చేశారు. మూడో సంతకంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి ఆరోగ్య బీమా పథకం ఫైలుపై సంతకం చేశారు.
ఆ తర్వాత ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఆ భగవంతుడు, మీ అందరి ఆశీస్సులతో మీ ఆకాంక్షలను నెరవేర్చుతా. మీ అంచనాలకు తగ్గట్టుగా బాధ్యతలను నిర్వహిస్తా" అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.