Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ అల్లుడుగా చంద్రబాబు చేయలేని పని జగన్ చేశారు... ఏంటది?

Webdunia
గురువారం, 30 మే 2019 (13:48 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు అల్లుడుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేయలేని పనిని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించనున్నారు.
 
సినీ రంగాన్ని వదులుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్.టి. రామారావు నెలకు కేవలం ఒక్కటంటే ఒక్క రూపాయి మాత్రమే వేతనం తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా ఒక్కరూపాయి వేతనం తీసుకోలేదు. 
 
చివరకు ఎన్.టి.రామారావు అల్లుడుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా మామ నిర్ణయాన్ని పాటించలేదు. గౌరవించలేదు. కానీ, నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ఆర్ తనయుడు, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. 
 
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. రూ.2.5 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌తో సాగుతోంది. దీంతో ప్రభుత్వ ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి నెలకు కేవలం ఒక్కటంటే ఒక్క రూపాయి మాత్రమే వేతన తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ముఖ్యమంత్రి వేతనం నెలకు రూ.2.50 లక్షలు కాగా, ఇతర అలవెన్సులను కూడా కలుపుకుంటే ఈ మొత్తం కాస్త రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు చేరుతుంది. ఈ ఖర్చును తగ్గించే చర్యల్లో భాగంగా ఆయన ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments