Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర రాష్ట్రాన్నిప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చేసిన జ‌గ‌న్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (18:44 IST)
ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్‌ తన ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా భావిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి విమర్శించారు. భాజపా ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భావితరాలకు ఏమీ మిగలదన్నారు. 
 
 
కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో గుంజుకుంటున్నారని ఆరోపించారు. ‘‘మద్యం ధరలు 150 శాతం పెంచారు. పెట్రోల్‌ ధరలు అన్ని రాష్ట్రాల్లో కంటే ఇక్కడే అధికంగా ఉన్నాయి. సినిమా రంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. 30 నెలలుగా ప్రజలు దుర్మార్గపాలన అనుభవిస్తున్నారు. ఏపీలో ఇంత వరకు భాజపా పాలన చూడలేదు. రాష్ట్రం అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయింద‌న్నారు.
 
 
కనిపించే అప్పుల కంటే, కనిపించని అప్పులే ఎక్కువ. విశాఖ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏపీలో కబ్జా అంటే ఏమిటో తెలియజేశారు. కేంద్ర సాయం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా చెల్లించాలి, కానీ రాష్ట్రం నుంచి తగిన సాయం ఇవ్వడంలేదు. పోలీసులను వైకాపా తమ కార్యకర్తలుగా వాడుకుంటోంది. 30 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. వైకాపా ఓడ తప్పకుండా మునిగిపోతుంది. భాజపాను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవాలి అని సుజనాచౌదరి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments