Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరుగా రైతుల‌ ఖాతాలోకి నగదు జమ చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (14:51 IST)
గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది. ఈ సెప్టెంబర్‌లో సంభవించిన గులాబ్‌ సైక్లోన్‌ వల్ల రైతులు భారీగా నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులకు రూ.22 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ప్ర‌భుత్వం ఆర్ధికంగా ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా ఏపీ సీఎం రైతుల‌కు మేలు చేయాల‌ని ఈ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల‌కు జ‌మ చేశారు.

 
 
మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా రైతులకు పెట్టుబడి రాయితీ అందించారు. ఈ తుపాను వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 34,586 మంది రైతులు పంట నష్టపోయార‌ని  వ్య‌వ‌సాయ‌శాఖ లెక్క‌లు తేల్చింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు పంట నష్టపరిహారం కింద 13.96 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం కింద రూ. 1,071 కోట్లు విడుదల చేసింది. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు, రబీలో పంట నష్టపోయిన వారికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద నేడు రూ.22 కోట్లను సీఎం జగన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments