Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడబిడ్డల జోలికి వెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదు.. బాబు వార్నింగ్

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (08:11 IST)
దేశంతో పాటు ఏపీలోనూ మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే వారికి అదే ఆఖరి రోజు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం గుంటూరులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. దీపం పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామనీ, మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడామన్నారు.
 
మహిళా సాధికారత అంటే ఏంటో తాను ఇంట్లో చేసి చూపానని చంద్రబాబు తెలిపారు. దాదాపు 27 ఏళ్ల క్రితం డైరీ పరిశ్రమను ప్రారంభించామని గుర్తుచేసుకున్నారు. తన భార్య భువనేశ్వరి కృషితో ఆ సంస్థను విజయవంతంగా నడుపుతున్నామని అన్నారు.
 
అన్న అమృత హస్తం ద్వారా గర్భిణులకు ఒకపూట భోజనం పెడుతున్నామని, సామూహిక సీమంతాలకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే కోటి మంది డ్వాక్రా మహిళలకు మొబైల్‌ ఫోన్లు ఇస్తామని చెప్పారు.
 
ఏపీలో మహిళలు తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంగన్‌వాడీల్లో పనిచేసేవారికి ప్రతి నెలా రూ.10,500 వేతనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments