Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటుపై స్పందించ‌ని చంద్రబాబు... ఏముంది అందులో...?! బాబునెవరూ కాపాడలేరు... అంబటి

విజ‌య‌వాడ ‌: ఓటుకు నోటు కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించ‌డానికి నిరాక‌రించారు. మీడియా మంగళవారమిక్కడ ఆయ‌న్ని ఈ కేసుపై ప్ర‌శ్నించ‌గా, ఆ కేసులో అసలు ఏముందని మాట్లాడటానికి అని అన్నారు. అంతేకాదు... ఆ కేసులో ఏముందో మీరే స్టడీ చేసి చెప్పాలన్నారు

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (19:40 IST)
విజ‌య‌వాడ ‌: ఓటుకు నోటు కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించ‌డానికి నిరాక‌రించారు. మీడియా మంగళవారమిక్కడ ఆయ‌న్ని ఈ కేసుపై ప్ర‌శ్నించ‌గా, ఆ కేసులో అసలు ఏముందని మాట్లాడటానికి అని అన్నారు. అంతేకాదు... ఆ కేసులో ఏముందో మీరే స్టడీ చేసి చెప్పాలన్నారు. త‌మ అడ్వకేట్లు అంతా చూసుకుంటార‌నే ధీమాను ఆయ‌న వ్య‌క్తం చేశారు.
 
మోదీ, వెంక‌య్య‌, కేసీయార్ కాద‌న్నా... ఇక‌ బాబును కాపాడ‌లేరు : అంబ‌టి
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ఎవరూ కాపాడలేరని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఏసీబీ సీఎంపై చార్జి షీటు పెడుతున్న నేప‌థ్యంలో ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాబోతున్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు జోక్యం చేసుకున్నా చంద్రబాబును తప్పించలేరని అంబ‌టి జోస్యం చెప్పారు. 
 
ఈ కేసు నుంచి చంద్రబాబును రక్షించేందుకు వెంక‌య్య‌నాయుడు రాజీతో, కేసీఆర్ ప్రయత్నించార‌ని ఆరోపించారు. దానికి ప్ర‌తిఫ‌లంగా ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని మండిపడ్డారు. ఇప్పుడిక చంద్ర‌బాబును ఎవ‌రూ కాపాడలేర‌ని వ్యాఖ్యానించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments