రాష్ట్రం పరువు తీసిన ఐపీఎస్‌లను వదిలిపెట్టం : ముంబై నటి కేసులో సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఠాగూర్
శనివారం, 31 ఆగస్టు 2024 (12:34 IST)
ముంబై నటి కాదంబరి జైత్వానీ కిడ్నాప్, వేధింపులు కేసులో రాష్ట్రం పరువు తీసిన ఐపీఎస్ అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ కేసులో పోలీసులు నడుచుకున్న ధోరణిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపారని మండిపడ్డారు. హీరోయిన్, ఆమె కుటుంబానికి వేధింపుల విషయంలో ప్రమేయం ఉన్న పోలీసులు అధికారులు ఏ హోదాలో ఉన్నా క్షమించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. శుక్రవారం నాడు మీడియాతో చిట్చాట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
అలాగే, గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారంపై కూడా ఆయన స్పందిస్తూ, విద్యార్థులు అందరి సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేపట్టామని, ఎలాంటి పరికరాలు దొరకలేదని ఆయన వెల్లడించారు. కొన్ని ప్రచారాల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రచారం పట్ల విద్యార్థులు అందరూ భయాందోళనలకు గురయ్యారని, సమాచారం తెలిసిన వెంటనే అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చంద్రబాబు వివరించారు. నేరానికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం విడిచిపెట్టబోదని వార్నింగ్ ఇచ్చారు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments