Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఢిల్లీకి వస్తున్నా.. అందర్నీ ఏకం చేస్తా... ఎంపీలతో చంద్రబాబు

ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినకు బయలుదేరనున్నారు. ఢిల్లీకి వెళ్లే ఆయన రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో క

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (16:18 IST)
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తినకు బయలుదేరనున్నారు. ఢిల్లీకి వెళ్లే ఆయన రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం మోసం చేసిన విషయం తెల్సిందే. ఈ విషయంలో కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు, జాతీయ పార్టీ నేతలకు వివరించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. 
 
సోమవారం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని... అందుకోసమే ఢిల్లీ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడమే తమ సామర్ధ్యమని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రెండురోజుల ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు చెప్పారు. ఈ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. 
 
సోమవారం సాయంత్రం ఢిల్లీ వస్తున్నానని... మంగళ, బుధవారాల్లో ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల సాధనపై దృష్టి సారించనున్నట్లు ఎంపీలతో చంద్రబాబు చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలువనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వ్యక్తిగతంగా వివరిస్తానన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్రానికి అన్యాయం చేస్తే.. బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments