Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలి... సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలి, అందరికీ నమూనాగా నిలవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సోమవారం తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి’ ఈ వారం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వ

Webdunia
సోమవారం, 24 జులై 2017 (19:43 IST)
ఆంధ్రప్రదేశ్ గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలి, అందరికీ నమూనాగా నిలవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సోమవారం తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి’ ఈ వారం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నీరు, విద్యుత్, సిమెంట్ రోడ్లు, పారిశుద్ద్యం, పచ్చదనం, ప్రభుత్వ భవనాలు, ఆటస్థలాలు, పంటకుంటలు, చెక్ డ్యాములతో ప్రతి గ్రామం స్వయంపోషకం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. 7 స్టార్స్ రేటింగ్ తో ప్రతి గ్రామం పట్టణాలకు ధీటుగా అన్ని వసతులతో రూపొందాలన్నారు. అటు మౌలిక సదుపాయాల కల్పన, ఇటు కుటుంబాల ఆదాయ పెంపు లక్ష్యంగా పనిచేయాలని కోరారు. గ్రామాభివృద్ది, కుటుంబాల ఆనందం, ఆరోగ్యజీవనం మన లక్ష్యాలు కావాలన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి కుటుంబం నెలకు కనీస రాబడి రూ.10వేలకు చేరుకునేలా అధికార యంత్రాంగం తగిన తోడ్పాటు అందించాలన్నారు.
 
సీజన్ మిస్ అయితే సంవత్సరం మిస్ అయినట్లే
సీజన్ మిస్ అయితే సంవత్సరం మిస్ అయినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అటు కాలాన్ని, ఇటు నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నప్పుడే,అనుకున్న ఫలితాలు సాధించగలమని, టార్గెట్లు పూర్తి చేయగలమని చెప్పారు. అనంతపురం జిల్లాలో వర్షపాతంలోటు అధికంగా ఉందంటూ, ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆగస్టు 15 లోపు వేరుశనగ నాట్లు పూర్తిచేసేలా చూడాలన్నారు.
 
ఇన్ పుట్ సబ్సిడి ఇప్పటికే 76% రైతుల ఖాతాల్లో పడిందని, మిగిలింది కూడా త్వరగా జమచేయాలని ఆదేశించారు. పెట్టుబడులకు రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ఈ క్రాపింగ్ 72% పూర్తి చేశారంటూ,100% పూర్తి చేయాలన్నారు. మైక్రో న్యూట్రియంట్స్ పంపిణీ 42% మాత్రమే జరిగిందని, మిగిలినవి కూడా వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. పంటరుణాల పంపిణీ లక్ష్యంలో 46% మాత్రమే  చేరుకోవడంపై అసంతృప్తి ప్రకటించారు. కౌలు రైతులకు రుణ పంపిణీ ముమ్మరం  చేయాలన్నారు. 26వ తేదీన వ్యవసాయ రుణాల పంపిణీపై సమీక్షిస్తానంటూ, ఆలోపునే లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.
 
14.61 కోట్ల పనిదినాలతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్
నరేగా కింద 14.61 కోట్ల పనిదినాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం గొప్పవిషయం అంటూ, 11.44 కోట్ల పనిదినాలతో రాజస్థాన్ రెండవ స్థానం, 10.76 కోట్ల పనిదినాలతో తమిళనాడు తరువాత స్థానంలో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. పంటసంజీవని టార్గెట్ 4లక్షలు కాగా ఇప్పటివరకు 75,500 పంటకుంటల తవ్వకం పూర్తయ్యిందని, గ్రవుండ్ అయిన 2,11,350 పంటకుంటలు వెంటనే పూర్తిచేయాలని కోరారు.
 
ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి:
నిర్ణీత కాలవ్యవధిని పెట్టుకుని అసంపూర్తిగా  ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఎంతమందికి ఇళ్లు ఉన్నాయి? ఎంతమందికి లేవు? ఇళ్లస్థలాలు ఎంతమందికి ఇవ్వాలి? అన్ని వివరాలు సర్వే చేయాలన్నారు. అన్ని ఇళ్ళను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ హవుసింగ్ కింద గ్రవుండ్ అయిన 2లక్షల ఇళ్లలో 60వేలు పూర్తయ్యాయని,  మిగిలిన లక్షా40వేల ఇళ్ల  నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా శ్రద్ద వహించాలన్నారు. ఎన్టీఆర్ రూరల్ హవుసింగ్ కింద 2017-18, 2018-19 కి మంజూరైన ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక 39%మాత్రమే జరిగిందంటూ వేగవంతం చేయాలన్నారు. ఐఏవై కింద అసంపూర్తిగా ఉన్న 17,816 ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలన్నారు. అవి కాకుండా మిగిలిన ఇళ్లు 2,56,796 యుద్ధప్రాతిపదికన నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ లో అన్నీ ఒరిజినల్ షాట్స్, డూప్లికేట్ కాదు : దర్శకుడు బాబీ

తెలుగులో శంకర్ కుమార్తె.. భైరవంలో అల్లరిపిల్ల పోస్టర్ వైరల్

తమన్ గొప్ప మనసు.. కిడ్నీ మార్పిడికి సాయం

శ్రీరెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు... వదిలేయండి మహాప్రభో అంటున్న...

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న 'దేవర'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments