Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి : మంత్రి భరత్‌కు సీఎం వార్నింగ్!!

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (22:17 IST)
ఏపీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌కు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నవ్యాంధ్రకు పెట్టుబడులే ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని ప్రత్యేక బృందం దావోస్‌లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌‍లోని జ్యూరిచ్‌ నగరంలో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖామంత్రి టీజీ భరత్ ప్రసంగిస్తూ, భవిష్యత్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేశ్ గారే అంటూ వ్యాఖ్యానించారు. ఎవరు కాదన్నా ఇది జరిగితీరుతుందన్న కోణంలో వ్యాఖ్యానించారు. 
 
ఇదే వేదికపై ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ మాటలు విని ఆగ్రహోద్రుక్తుడయ్యారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఇలాంటి వేదికలపై మాట్లాడొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు.. మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి.. అసందర్భం ప్రసంగాలు చేయొద్దని మందలించారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మరోమారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments