Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నగరాన్ని భ్రష్టు పట్టించారు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

విజయవాడ : విజయవాడలో జ‌రుగుతున్న‌ అభివృద్ధి పనుల్లో భాగంగా బుధ‌వారం ఇన్నర్ రింగ్ రోడ్డును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గత పాలకుల నిర్వాకం వల్ల ఇన్నర్ రింగ్‌ రోడ్డు పనులు నాసిరకంగా జరిగాయని, వారి నిర్లక్ష్యంతో విజయవాడ పరిస్థితిని చూస్తే గుం

Webdunia
బుధవారం, 27 జులై 2016 (20:29 IST)
విజయవాడ : విజయవాడలో జ‌రుగుతున్న‌ అభివృద్ధి పనుల్లో భాగంగా బుధ‌వారం ఇన్నర్ రింగ్ రోడ్డును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గత పాలకుల నిర్వాకం వల్ల ఇన్నర్ రింగ్‌ రోడ్డు పనులు నాసిరకంగా జరిగాయని, వారి నిర్లక్ష్యంతో విజయవాడ పరిస్థితిని చూస్తే గుండె తరుక్కుపోయిందన్నారు. అమరావతికి కేంద్ర బిందువు విజయవాడని చంద్రబాబు చెప్పారు. దుర్గమ్మ ఫ్లైఓవర్‌ను త్వరలోనే పూర్తిచేస్తామని చంద్రబాబు తెలిపారు. మచిలీపట్నం రహదారి నిర్మాణ పనులు, బెంజి సర్కిల్‌ ఫ్లైవోవర్ పనులను త్వరలో ప్రారంభిస్తామని చంద్రబాబు అన్నారు. 
 
విజయవాడ నగరాన్ని భ్రష్టుపట్టించారని చంద్రబాబు ఆరోపించారు. రామవరప్పాడు నుంచి నుంచి గొల్లపూడి వరకు 9.84 కిలోమీటర్ల మేర రెండు హైవేలను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి రావడంతో  హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను  మళ్లించనున్నారు. కేవలం 18 నెలల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశామని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల ట్రాఫిక్ సమస్య తీరడమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు. 
 
అలాగే పాత విజయవాడ వేరు.. అభివృద్ధి చెందుతున్న విజయవాడ వేరని చంద్రబాబు అన్నారు. స్పీడ్ క్యాపిటల్‌కు ఇన్నర్ రింగ్ రోడ్లను అనుసంధానం చేస్తామని తెలిపారు. అలాగే కృష్ణా పుష్కరాల గురించి కూడా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు పుష్కరాలకు వచ్చే భక్తులను బంధువుల్లా ఆదరించాలని బెజవాడ ప్రజలకు సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments