Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని మార్పు కేసు విచారణ వాయిదా :: జీవో 107పై షాకిచ్చిన సుప్రీం

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (14:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పు కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదావేసింది. అలాగే, ఈ కేసును మరో బెంచ్‌కు లిస్టు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లుల అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ స్టేను ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అయితే విచారణ జరుగుతున్న సమయంలో రైతుల తరపున హాజరైన సీనియర్ కౌన్సిల్ రజింత్ కుమార్ ప్రధానన్యాయమూర్తి బాబ్డే దృష్టికి ఓ విషయం తీసుకువచ్చారు. 
 
ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన బంధువులు రైతుల తరపున హాజరవుతున్నారని గుర్తుచేశారు. దీంతో ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నానని బాబ్డే అన్నారు. ఈ కేసును వేరే బెంచ్‌కు లిస్టు చేయాలని రిజిష్ట్రార్‌ను ఆదేశిస్తూ వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. 
 
అలాగే, ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురైంది. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 107పై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన స్టేను సమర్ధించింది. 
 
ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపించింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను హైకోర్టులోనే వినిపించుకోవాలని... అక్కడ ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి నిరాకరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments