Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ ఊపిరి - త్వరలో పనులు ప్రారంభం...

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ఊపిరి వచ్చింది. రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఏపీ సర్కారు రూ.11467 కోట్లను కేటాయించింది. మొత్తం 23 అంశాలకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ - సీఆర్డీయే ఆమోదం తెలిపింది. ఈ నిధులతో రోడ్లు, రిజర్వాయర్ల నిర్మాణం, అధికారుల నివాస భవనాల నిర్మాణాలను చేపట్టనున్నారు. 
 
ఇందులోభాగంగా, తొలి దశలో రూ.11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీఆర్డీయే అథారిటీ 41వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వీటిలో చాలా వరకు పనులను ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సహకారంతో చేపడతారు.
 
మొత్తం రూ.11,467 కోట్లలో రూ.2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనులు చేపట్టగా, రూ.1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాల్వల అభివృద్ధి, మూడు రిజర్వాయర్లు నిర్మిస్తారు. అలాగే, రూ.3,525 కోట్లతో అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవన నిర్మాణాలను పూర్తిచేస్తారు. 
 
రూ.3,859 కోట్లతో భూసేకరణలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన స్థలాల లేఅవుట్ల అభివృద్ధి పనులను కొనసాగిస్తారు. అలాగే, 2019కి ముందున్న టెండర్లు రద్దు చేసి కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తారు. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రూ.948.10 కోట్ల సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలుస్తారు. ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల సీఆర్డీయే నష్టపోయే రూ.270.71 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments