Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీ కొత్త మంత్రివర్గ తొలి సమావేశం... దిశచట్టం సవరణపై చర్చ

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (13:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్తమంత్రివర్గం తొలి సమావేశం శుక్రవారం జరుగనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. ఇటీవల ఏపీ మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కొత్త మంత్రివర్గం ఒక్కసారి కూడా సమావేశంకాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరుగనుంది. ఈ భేటీ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
 
ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో రెండు లక్షల ఎకరాలు భూములు అర్చకుల ఆక్రమణలో ఉన్నట్టు గుర్తించారు. ఈ భూములపై ప్రధానంగా చర్చ జరుగనుంది. 
 
అలాగే, దిశ చట్టం సవరణలకు సంబంధించిన అంశాన్ని కూడా మంత్రివర్గంలో మరోమారు నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఇటీవల కోనసీమ జిల్లా పేరు మార్పుపై చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు ఆ జిల్లా మార్పుపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
 
అలాగే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైకాపా ఎంపీలు మద్దతు ఇచ్చే విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే భేషరతు మద్దతు ప్రకటించిన వైకాపా.. ఆమె నామినేషన్ దాఖలు సమయంలోనూ వైకాపా ఎంపీలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments