Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయండి : సుప్రీంలో ఏపీ సర్కారు పిటిషన్

ఠాగూర్
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (15:20 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు గతంలో విచారణను వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే అందుబాటులో లేరని కోర్టుకు మరో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలుపుతూ, మూడు వారాలు సమయం కావాలని కోరారు. దీనికి ఏపీ సీఐడీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
గతంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఇలాగే సమయం తీసుకున్నారని, ఇపుడు కూడా మళ్లీ వాయిదా కోరుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తరపున ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసినందుకు వీలైనంత త్వరలో తదుపరి విచారణ చేపట్టాలని తేదీని నిర్ణయించాలని సుప్రీం ధర్మాసనాన్ని రంజిత్ కుమార్ కోరారు. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం త్రివేది తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి రెండు వారాల తర్వాత లిస్ట్ చేయాలని ధర్మాసనం భావించినప్పటికీ ఏపీ సీఐడీ న్యాయవాది విజ్ఞప్తితో ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments