Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరిలో అన్నమయ్య మెట్లోత్సవం

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (10:43 IST)
శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల వారి 518 వర్ధంతి మహోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో  బుధవారం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం నిర్వహించారు.
 
అన్నమాచార్య వంశీయులు శ్రీ హరి నారాయణ పాదాల మండపం వద్ద అన్నమయ్య విగ్రహం వేంచెపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నమాచార్య పాజెక్టు కళాకారులు సంకీర్తనలు ఆలపించారు.

అనంతరం వీరు తిరుమలకు నడచి వెళ్లారు. కోవిడ్ 19 నిబంధనలు అనుసరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
 పాజెక్టు డైరెక్టర్ దక్షిణామూర్తి శర్మ మాట్లాడుతూ ప్రాజెక్టు వద్ద ఉన్న అన్నమయ్య సంకీర్తనలకు అర్థ, తాత్పర్యాలు జనబాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళే ప్రక్రియ జరుగుతోందన్నారు.

గురువారం తిరుమల నారాయణగిరి ఉద్యాన వనంలో జరిగే అన్నమాచార్యుల వర్ధంతి కార్యక్రమానికి అహోబిలం పీఠాధిపతి యతీంద్ర మహాదేశికన్ హాజరై అనుగ్రహ భాషణం చేస్తారని చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments