Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజిరెడ్డి తాత మ‌న‌వరాలి పెళ్లికి నారా లోకేష్ కానుక 3 ల‌క్ష‌లు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:28 IST)
అంజిరెడ్డి తాత తెలియ‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లుండ‌రు. దౌర్జ‌న్య‌క‌ర వైసీపీ ఫ్యాక్ష‌న్ సెల‌క్ష‌న్‌ని ఎదిరించి ఎల‌క్ష‌న్ జ‌ర‌పాల‌ని తొడ‌కొట్టిన చిత్తూరు జిల్లా, పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం, పుంగ‌నూరు మండ‌లం, మార్ల‌ప‌ల్లె గ్రామ తెలుగుదేశం సైనికుడు అయ్య‌మ్మ‌గారి అంజిరెడ్డికి తెలుగుదేశం జెండాకున్నంత పొగరుంది.

టిడిపి కార్య‌క‌ర్త‌కున్నంత ధైర్య‌ముంది. అందుకే ఏడుప‌దుల వ‌య‌స్సు దాటినా...అధికార‌మ‌ద‌మే ఆయుధంగా వైసీపీ మూర్ఖ‌పు ముష్క‌రులు దాడికి త‌ల‌ప‌డితే, మీసం మెలేసి..తొడ‌గొట్టి మ‌రీ ఎదురు నిలిచాడు అంజిరెడ్డి తాత.  త‌న మ‌న‌వ‌డు ప‌వ‌న్‌రెడ్డిని తోడు తీసుకెళ్లి టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ని మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో క‌లిశారు అంజిరెడ్డి తాత‌. 

ఈ సంద‌ర్భంగా అంజిరెడ్డి తాత‌ని కుశ‌ల‌ప్ర‌శ్న‌లు అడిగిన నారా లోకేష్‌...ఆరోగ్యం ఎలా వుంది? అంటూ ఆరా తీశారు. అంతా బాగానే ఉంద‌న్న అంజిరెడ్డి తాత బీటెక్ చేసిన త‌న మ‌న‌వ‌రాలికి త్వ‌ర‌లో వివాహం చేయాల‌నుకుంటున్నాన‌ని చెప్పారు. అప్ప‌టిక‌ప్పుడు నారా లోకేష్ 3 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అంజిరెడ్డి తాత మ‌న‌వ‌రాలి పెళ్లికి త‌న‌వంతు సాయంగా అంద‌జేశారు.

35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో వున్నా..ఏనాడూ ఏ ప‌ద‌వీ తీసుకోలేద‌ని, పార్టీని న‌మ్ముకున్న త‌నను సొంత తాత‌య్య‌లా నారా లోకేష్ ఆద‌రించార‌ని అంజిరెడ్డి తాత ఆనందం వ్య‌క్తం చేశారు.

త‌న మ‌న‌వ‌డు బీటెక్ చేశాడ‌ని, తెలుగుదేశం పార్టీ యువ‌సైన్యంలో అవ‌కాశ‌మిస్తే పార్టీ బ‌లోపేతం కోసం శాయ‌శ‌క్తులా కృషి చేస్తాడ‌ని అంజిరెడ్డి తాత లోకేష్‌ని కోరారు.

త‌ప్ప‌నిస‌రిగా మ‌న‌వ‌డికి పార్టీలో ఏదో ఒక విభాగంలో అవ‌కాశం ఇచ్చేలా చూస్తాన‌ని హామీ ఇచ్చిన నారా లోకేష్‌...మ‌న‌వ‌రాలి పెళ్లి ఘ‌నంగా చేయాల‌ని అంజిరెడ్డి తాత‌కి సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments