Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌలు రైతు భరోసాకు చిరంజీవి తల్లి అంజనా దేవి ఆర్థిక సాయం

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (21:57 IST)
జనసేన పార్టీ తరపున కౌలు రైతులను ఆదుకునే బృహత్తర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌలు రైతులకు తన వంతు ఆర్థిక సాయం చేస్తున్నారు. అయితే, రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి ఆయన తల్లి అంజనాదేవి తనవంతు సాయంగా రూ.లక్ష విరాళం అందించారు. 
 
అలాగే, జనసేన పార్టీకి మరో రూ.లక్ష విరాళం ఇచ్చారు. తన భర్త, హీరో పవన్‌ తండ్రి వెంకట్రావు జయంతి సందర్భంగా విరాళం చెక్కును హైదరాబాద్‌లో ఆమె అందజేశారు. తన తండ్రి పింఛను డబ్బులను ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఇచ్చినందుకు తల్లికి పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.
 
ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... కౌలు రైతుల భరోసాయాత్ర నిధి, జనసేన పార్టీకి విరాళం అందించిన తన తల్లికి కృతజ్ఞతలు తెలిపారు. 'సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని ఎందుకు కోరుకుంటానంటే అది మా ఫ్యామిలీకి భావోద్వేగంతో కూడుకున్నది. అందుకే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకురావడానికి మా వంతు ప్రయత్నిస్తాం. ఉద్యోగులకు అండగా ఉంటాం' అని పవన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments