Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం నుంచి టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలు వరకు పరీక్ష జరుగనుంది. పదహారు రోజుల పాటు జరుగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,49,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఏపీ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వారు పేర్కొన్నారు. 
 
ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో పరీక్షా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థును పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, పదో తరగతి హాల్ టిక్కెట్ చూపించి ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు కూడా పదో తరగతి విద్యార్థుల కోసం రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments