Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్పీ దిగాడనీ కొట్టి చంపేశారు.. కంచిలో తెలుగు యువకుడిపై ఖాకీల దాష్టీకం

Webdunia
గురువారం, 4 జులై 2019 (12:55 IST)
కాంచీపురంలోని శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయంలో 40 యేళ్లకు ఒకసారి జరిగే అత్తివరదర్ ఉత్సవాలు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. ఈయన స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారితో సెల్ఫీ దిగాడు. దీన్ని గమనించిన విధుల్లో వుండే పోలీసులు.. ఆ యువకుడుని పట్టుకుని చితకబాదారు. దాంతో ఖాకీల దెబ్బలకు తాళలేక ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో జరిగింది. మృతి చెందిన యువకుడి పేరు ఆకాష్. రాజమండ్రి వాసి. ఆలయంలో బంగారు బల్లిని దర్శనం తర్వాత స్వామి వారిని దర్శనం చేసుకుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు... ఆకాష్ సెల్ఫీ దిగడంపై ఆగ్రహిస్తూ ముష్టిఘాతాలు కురిపించారు. దీంతో ఆకాష్ అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
తన బిడ్డను పోలీసులు కొట్టి చంపారంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం మరోరకంగా స్పందిస్తున్నారు. గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడని చెపుతున్నారు. మృతదేహాన్ని కంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఎంతో వైభవంగా జరుగుతున్న అత్తి వరదర్ వేడుకల్లో అకాష్ మృతి ఆలయంలో కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments