Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపూట బడులు... నవంబరు 2 నుంచి పునఃప్రారంభం!

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (19:06 IST)
కరోనా లాక్డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. నవంబరు రెండో తేదీ నుంచి సుధీర్ఘకాలంగా మూతపడిన స్కూల్స్, కాలేజీల తలుపులు తెరుచుకోనున్నాయి. 
 
నవంబరు 2 నుంచి దశల వారీగా విద్యాసంస్థల పునఃప్రారంభం ఉంటుందని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించగా, ఆ మేరకు రాష్ట్ర సీఎస్ నీలం సాహ్నీ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారు. అది కూడా ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహిస్తారు.
 
నవంబరు 2 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు క్లాసులు ఉంటాయి. నవంబరు 12 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు క్లాసులు జరుపుతారు. నవంబరు 23 నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం అవుతుంది.
 
ఇకపోతే, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి క్లాసులు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. 
 
కరోనా నియమావళికి అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని తరగతుల నిర్వహణ జరపాల్సి ఉంటుందని షెడ్యూల్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అమెరికాలో హాలీవుడ్ నటుడు కాల్చివేత

పుష్ప 2 లో సెకండ్ సింగిల్ ను 6 భాషల్లో పాడిన మెలోడీ క్వీన్ శ్రేయఘోషల్

కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్ . రూ. 17.70 కోట్ల‌కు అమ్ముడైన‌ ఆడియోరైట్స్

గం..గం..గణేశా యాక్షన్ కామెడీ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - నిర్మాత వంశీ కారుమంచి

డ్యాన్స్ బేస్డ్ సినిమా చేయాలనే కోరిక ఉంది : హీరోయిన్ ఐశ్వర్య మీనన్

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments