Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఫలమైన మంత్రుల వ్యూహాలు... సీఎం జగన్‌కు తొలి చెంపదెబ్బ...

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (07:06 IST)
ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ఆమోదించుకునేందుకు వైకాపా మంత్రులు శతవిధాలా ప్రయత్నించారు. ఇందుకోసం గంటల కొద్దీ శాసనసభలోనే ఉంటూ గంటగంటకో వ్యూహం రచించారు. కానీ, అవన్నీ పూర్తిగా విఫలంకావడంతో రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులా మారింది. 
 
నిజానికి రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా చేయాలని వైకాపా మంత్రులు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ, తెదేపా సీనియర్ల ముందు ఘోరంగా విఫలమయ్యారు. ఈ బిల్లు సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతోంది. అప్పటివరకు రాజధాని తరలింపు తాత్కాలికంగా ఆగినట్టే. 
 
నిజానికి రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఆపాలని పార్టీ సీనియర్లు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను ఆదేశించారు. దీంతోవారంతా రెండు రోజుల పాటు శాసనమండలిలోనే మకాం వేశారు. అయినప్పటికీ తెదేపా సభ్యులతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు గుండె నిబ్బరంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి బిల్లును  సెలెక్ట్ కమిటీకి పంపించారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments