Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మూడు"పై ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్.. గెజిట్‌పై స్టేటస్ కో

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (18:31 IST)
ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానులపై విడుదల చేసిన గెజిట్‌ను నిలిపి వేయాలని దాఖలైన పిటిషన్‌ హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించి, విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మూడు రాజధాని గెజిట్‌పై స్టేటస్ కో(యథాతథ స్థితి) ఆదేశాలను హైకోర్టు జారీచేసింది. 
 
రాజధాని తరలింపుతో పాటు, సీఆర్డీఏ రద్దు చట్టంపై స్టేటస్ కో విధించింది. 10 రోజుల పాటు యథాతథ స్థితి అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. 14వ తేదీ వరకు ఇది కొనసాగుతుందని పిటిషన్‍ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజుల సమయం కావాలని కోర్టును ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు.
 
పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సర్కారు దూకుడుకు కాస్తంత బ్రేక్ పడినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం