Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వ తీర్మానం

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (16:38 IST)
గ‌తంలో చేసిన శాస‌న మండలి ర‌ద్దుపై సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. అసెంబ్లీ సమావేశాలలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ తీర్మానం చేసింది. 
 
 
గత ఏడాది జనవరిలో ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం తెచ్చారు. రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమో
దం కోసం పంపగా, గత 22 నెలలుగా అది కేంద్రం వద్దే పెండింగ్ లో ఉండిపోయింది. దాంతో శాసనమండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడా సందిగ్ధత తొలగిపోయింది. మండలి రద్దును వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ సర్కారు తీర్మానం చేయడంతో మండలిని యథావిధిగా కొనసాగించేందుకు మార్గం సుగమం అయింది.
 
 
గ‌తంలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌యిన వారు, ఇపుడు కొత్త‌గా ఎన్నిక అవుతున్న‌వారు అంద‌రికీ ఇది ఒక తీపి క‌బురు. మండ‌లిని పున‌రుద్ధ‌రించ‌డంతో, వారికి మ‌ళ్ళీ ఎమ్మెల్సీ ప‌ద‌వి యోగం కొన‌సాగింపుగా మారింది. మండ‌లి ర‌ద్దుపై గ‌తంలో టీడీపీ ఎంతో పోరాటం చేసింది. ర‌ద్దు కాకుండా, త‌మ పార్టీకే చెందిన శాస‌న మండ‌లి ఛైర్మ‌న్ స‌హాయంతో చక్రం తిప్పేందుకు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఎంతో ప్ర‌య‌త్నం చేశారు. కానీ, మొండి ప‌ట్టుద‌ల‌తో మండ‌లిని వై.ఎస్. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేస్తూ, తీర్మానం కాపీని కేంద్రం ఆమోదం కోసం పంపారు. కానీ, కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై ఇంత వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డంతో, తిరిగి మండ‌లి ర‌ద్దు బిల్లును ఏపీ ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments