Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటు వైసీపీ ప్లీనరీ.. అటు రైతు దినోత్సవం

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (11:40 IST)
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించింది జగన్ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఇటు వైసీపీ ప్లీనరీ.. ఇటు రైతు దినోత్సవం పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్ధాయిలో, ఆర్బీకేలలో రైతు దినోత్సవం వేడుకలు.. రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, జిల్లా వనరుల కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వ్యవసాయ అనుబంధ శాఖలపై ఎగ్జిబిషన్‌ స్టాళ్ళు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలపై ప్రచారం చేస్తోంది. 
 
1. వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌, 2. రైతు భరోసా కేంద్రాలు, 3. వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు, 4. ఇన్‌పుట్‌ సబ్సిడీ, 5. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, 6. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం వంటి పథకాలను ప్రభుత్వం అందిస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లోనే ఆయా పథకాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తోంది.
 
ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పథకాల కింద నేటి వరకు రైతులకు రూ.1,27,633.08 కోట్లు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. 
 
వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా, ఉచిత విద్యుత్‌ సబ్సిడీతో పాటు నాణ్యత పెంచేందుకు విద్యుత్‌ ఫీడర్లు ఏర్పాటు చేసినట్లు వివరించింది.
 
ఆర్బీకేలకు అనుసంధానంగా అమూల్‌ భాగస్వామ్యంతో పాలసేకరణ కేంద్రాలు, అమూల్‌ ద్వారా గతంలో కంటే అదనంగా లీటర్‌కు రూ. 5 నుండి రూ. 15 వరకు పాడిరైతులు అదనంగా అందుకుంటున్న సర్కార్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments