Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు-జగన్‌కు మోదీ ఫోన్

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (15:01 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు, కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇళ్ళు నేలకొరిగాయి. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
 
మరోవైపు ఏపీ లోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు . రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
 
వరదల్లో చిక్కుకుని అనేక మంది గల్లంతయ్యారు. తాజాగా రాజంపేట వరదల్లో 12 మంది మృతి చెందగా, నందలూరు పరీవాహక ప్రాంతంలో 30 మంది చెయ్యేరు వరద ఉధృతిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
 
ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్ అధికారులకు సూచనలు సలహాలు అందిస్తున్నారు. ఇక మరోవైపు వరదల కారణంగా ఇప్పటికీ సికింద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళవలసిన పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

Pushpa-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?

Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments