Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ వరదలు : 32 మంది మృత్యువాత.. అత్యధికంగా ఆ జిల్లాలోనే...

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (09:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆ కారణంగా సంభవించిన వరదల వల్ల ప్రాణనష్టం సంభించింది. ఈ వరదల్లో చిక్కుకుని 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా 24 మంది ఎన్టీఆర్ జిల్లాలో చనిపోయారు. అలాగే 3973 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ జల విలయం కారణంగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. వరదల కారణంగా అనేక జనావాస కాలనీలు నీట మునిగాయి. ఇప్పటివరకు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 32 మంది మృతిగా ఉందని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 
 
ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 24 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారని పేర్కొంది. 2 లక్షల 34 వేల మంది రైతులు నష్టపోయారని తెలిపింది. 1,69,370 ఎకరాల్లో పంట... 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం జరిగిందని చెప్పింది. 60 వేల కోళ్లు, 222 పశువులు చనిపోయాయని వెల్లడించింది.
 
రాష్ట్ర వ్యాప్తంగా 3,973 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం తెలిపింది. 22 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. 193 పునరావాస కేంద్రాల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. 50 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు పని చేస్తున్నాయని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments