Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీ జూన్ 2గా ఖరారు!

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (18:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీని జూన్ 2వ తేదీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలను చర్చించారు. జూన్ 2న తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయంతోపాటు శ్రీశైలం జల వివాదం గురించి కూడా మంత్రివర్గం చర్చించింది. రాజధాని భూ సమీకరణపై ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం సూచించింది. 
 
అంతేకాకుండా, తిరుమలలో అన్యమత ప్రచారంపై మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర మతాలను గౌరవిస్తూనే అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే, నవంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో తన సింగపూర్, జపాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి వెల్లడించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments