Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ డీఎస్సీకి సర్వం సిద్ధం : రేపటి నుంచి ఆన్‌లైన్‌లో పరీక్షలు

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (11:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు సోమవారం నుంచి జరుగనున్నాయి. మొత్తం 7902 పోస్టులకుగాను 5.89 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగనున్నాయి. ఇందుకోసం మొత్తం 124 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 
 
అయితే, టెట్ పరీక్షలో అర్హత పొందిన 18931 మంది అభ్యర్థులు డీఎస్సీ అర్హత కోల్పోయారు. దీంతో 5,89,228 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాయనున్నారు. తొలివిడతలో 24 నుంచి స్కూల్‌ అసిస్టెంట్స్‌(లాంగ్వేజెస్‌, నాన్‌ లాంగ్వేజెస్‌), పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌, పండిట్‌, పీఈటీ పరీక్షలు జరుగుతాయి. వీటికి 2,43,175 మంది హాజరుకానున్నారు. రెండోదశలో జనవరి 30 వరకు జరిగే ఎస్‌జీటీ పరీక్షలకు 3,46,053 మంది హాజరుకానున్నారు.
 
డీఎస్సీ పరీక్షలు రెండు సెషన్లలో (ఉదయం 9.30-12గంటల వరకు, మధ్యాహ్నం 2.30-5 గంటల వరకు) పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 124 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఏపీలో 113, ఒడిసాలో 3, తెలంగాణలో 4, బెంగుళూరులో 2, చెన్నైలో 2 కేంద్రాలు ఉన్నాయి. కాగా, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?

Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

Vishal: విశాల్‌కు ఏమైంది.. బక్కచిక్కిపోయాడు.. చేతులు వణికిపోతున్నాయ్..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments