Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసారావుపేటలో దారుణం.. డిగ్రీ విద్యార్థిని చంపేసిన ప్రేమోన్మాది

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:52 IST)
గుంటూరు జిల్లా నరసారావు పేటలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది కిరాతకుడిగా మారిపోయి, డిగ్రీ విద్యార్థిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బుధవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పట్టణంలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో కోటా అనూష(20) అనే యువతి బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడుకు చెందిన అనూష రోజూ మాదిరిగానే ఇంటి నుంచి కళాశాల బస్సులో కాలేజీకి వచ్చింది. బస్సు దిగిన అనంతరం ఆమెను ప్రేమోన్మాది విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడాలని చెప్పి ఆటోలో ఎక్కించుకు వెళ్లినట్లు సహచార విద్యార్థులు చెబుతున్నారు. 
 
పట్టణ శివారులోని రావిపాడు సమీపంలోని పంట కాలువ వద్దకు తీసుకెళ్లి అనూష గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని కాలువ ఒడ్డున పడవేసి కనిపించకుండా చెత్త కప్పాడు. 
 
అనంతరం పోలీసుస్టేషన్‌కు వచ్చి తాను అనూషను హత్య చేశానని, మృతదేహం కాలువ వద్ద ఉందని పోలీసులకు తెలిపాడు. వెంటనే పోలీసులు  ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ఇద్దరి సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్‌ చేశారు.
 
కాగా, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో తనను నిర్లక్ష్యం చేస్తుందని భావించిన విష్ణు.. అనూషను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మాట్లాడాలని నమ్మించి తీసుకెళ్లి హత్య చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments