Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల ఆంధ్ర : ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పే

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (10:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఆంధ్రగా మారనుందా? సీఎం జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పు తెచ్చి ఖర్చు చేస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకునివుందని ఆర్థిక నిపుణులుతో పాటు... కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చింది. 
 
ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు మొత్తాన్ని తీసుకుంది. ప్రభుత్వం గత ఐదు నెలల్లో వివిధ రూపాల్లో రూ.84,617.23 కోట్లు సమీకరించగా, అందులో రూ.47,130.90 కోట్ల రుణాలు ఉన్నాయి. అంటే మొత్తం సమీకరించిన మొత్తంలో 55.7 శాతం అప్పుగా ఉందని కాగ్ గుర్తుచేసింది. 
 
ముఖ్యంగా, కరోనా మహమ్మారి కష్టకాలంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, పన్నులు, పన్నేతర ఆదాయాలు తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. సెక్యూరిటీల వేలం, ఇతర అప్పుల రూపంలో ఈ ఏడాది రూ.48,295.58 కోట్లు తీసుకోనున్నట్టు బడ్జెట్ అంచనాల సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆగస్టు నాటికే ఆ మొత్తాన్ని తీసేసుకున్నట్టు కాగ్ నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments