Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి.. ఆంధ్రాలో కలకలం?!

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (13:31 IST)
దేశంలో కరోనా బాధిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇక్కడ ఇప్పటికే 450కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక కరోనా మరణం కూడా సంభవించిది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కరోనా వైరస్‌ కేసుల్లో అగ్రస్థానంలో ఉంది. ఈ వైరస్ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో కరెన్సీ నోట్ల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చేస్తున్నారంటూ ఓ ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అధికారులు కూడా చెబుతున్నారు. ఇప్పటివరకు ఇటువంటి అనుమానాలు లేకపోయినా తాజాగా గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించిన రెండు కేసుల పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ నిర్థారణకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 
 
కరోనా వైరస్‌ ఎక్కువగా చేతుల్లోనే తిష్టవేసి ఉంటుంది. ఎందుకంటే దైనందిన జీవితంలో కంప్యూటర్‌ను ఆన్‌ చేయడం నుంచి బాత్‌రూంకు వెళ్లేటప్పుడు తలుపులు తీయడం, లిఫ్ట్‌ ఎక్కిదిగినప్పుడు డోర్ల ఆపరేషన్‌, స్విచ్ఛ్‌లు ఆన్‌ చేయడం అన్నీ చేతులతోనే చేస్తుంటారు. దీనివల్ల ఒకరి చేతిలోని వైరస్‌ మరొకరి చేతిలోకి విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
ప్రస్తుతం క్రయవిక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్‌ఎంపీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు వీలైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments