Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంట్రాక్టు ఉద్యోగులపై సీఎం జగన్ 'రివర్స్' అస్త్రం

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (15:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు, పీపీఏల రద్దు వంటి అంశాలపై ఆయన రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. తద్వారా ప్రభుత్వానికి రూ.కోట్ల మేరకు ఆదా అయినట్టు వైకాపా సర్కారు చెప్పుకుంటూ వచ్చింది. 
 
ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులపై కూడా జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అస్త్రాన్ని ప్రయోగించారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపులోనూ రివర్స్ వెళ్తోంది. మహిళ, శిశుసంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులపై రివర్స్‌ అస్త్రం విసిరింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 వేల నుంచి 7 వేల రూపాయల వరకు జీతాలు పెరిగిన విషయం విదితమే. 
 
అయితే ఇప్పటివరకు అందుకున్న పెరిగిన జీతం మొత్తం తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలంటూ ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments