Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (18:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలే వైకాపా పేర్కొన్నట్టుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓ అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. 
 
మంత్రిమండలి నిర్ణయం మేరకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఏర్పాటైన ఈ అధ్యయన కమిటీకి సీఎస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్‌ఏ, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారిని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఉండనున్నారు.

లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ఏపీలో 25 జిల్లాలు ఏర్పడనున్నాయి. కాగా, 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు నిర్దేశించారు. ఈ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ సర్కారు చర్యలు తీసుకోనుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక్కో ఎంపీ స్థానాన్ని ఒక్కో జిల్లాగా ప్రకటించనున్నారు. ఆ ప్రకారంగా ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి త్వరలోనే జిల్లా కేంద్రంగా అవతరించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments