Webdunia - Bharat's app for daily news and videos

Install App

125 రోజుల్లోనే రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేశాం.. బాబు

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (18:35 IST)
పోలీసు శాఖకు చెందిన 763 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఇకపై తమ సర్కారు క్లియర్ చేస్తుందని, 6,100 మంది కానిస్టేబుళ్లను నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 
 
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం (వైఎస్‌ఆర్‌సీపీ) పోలీసు శాఖకు చెందిన రూ.763 కోట్లకు పైగా బిల్లులు చెల్లించకుండా వదిలేసింది. 
 
పోలీసు శాఖకు సహకరించేందుకు దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటామని, ఆ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని పోలీసు సంస్మరణ దినోత్సవంలో భాగంగా బాబు తన ప్రసంగంలో తెలిపారు. పోలీసు శాఖలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం లాంటిదని పేర్కొన్న సీఎం.. దానికి తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ సహకరిస్తున్నానని చెప్పారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లోనే శాఖకు చెందిన రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులను ఇప్పటికే క్లియర్ చేసిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం వుందని.. పోలీసులు పాత ఫ్యాషన్ సాంకేతిక సాధనాలతో నేరస్థులతో పోరాడలేరని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments