Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణాసంచా బాధితులకు చంద్రబాబు ఓదార్పు.. రూ.3 లక్షల పరిహారం.. ఎంఆర్వో సస్పెండ్

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (18:16 IST)
కొత్తపల్లిలో జరిగిన బాణాసంచా పేలుడు మృతులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. ఆతర్వాత మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. కాగా, ప్రమాదం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి స్థానిక ఎమ్మార్వోను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. 
 
తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్పలో అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించిన విషయం తెల్సిందే. ఈ పేలుడులో 13 మంది మృత్యువాతపడగా, మంగళవారానికి ఈ సంఖ్య 16కు చేరిన విషయం తేల్సిందే. 
 
ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. అలాగే క్షతగాత్రుల కుటుంబాలను కూడా ఆయన ఓదార్చారు. ఇందుకోసం ఆయన గన్నవరం నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న సీఎం... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాకినాడకు వెళ్లారు. 
 
ముందుగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం తరపున సాయం చేస్తామని బాబు చెప్పారు. అనంతరం కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. మరోవైపు బాణాసంచా ఘటనలో మంగళవారం ఉదయానికి 16కు చేరింది. మరో ముగ్గురు స్థానిక అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments