Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (18:57 IST)
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేసింది. ఈ నెల 4వ తేదీన వెలువడే ఫలితాల్లో ఈ మూడు పార్టీల కూటమి ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఇండియా టుడ్ ఎగ్జిట్ పోల్స్ సర్వే వెల్లడించింది. ఇదే తరహా ఫలితాలను అనేక సర్వే సంస్థలు వెల్లడించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇండియా టుడే సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలను ఆదివారం వెల్లడించింది. 
 
టీడీపీ సొంతంగా 78-96 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మిత్రపక్షాలు జనసేన 16-18 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 4-6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. ఇక అధికార వైకాపా 55-77 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌కు 0-2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
 
ఇండియా టుడే సర్వే ప్రకారం కూటమికి 98-120 స్థానాలు.. వైకాపా 55-77, కాంగ్రెస్‌ 0-2 స్థానాల్లో విజయం సాధించే అవకాశముంది. ఇక పార్టీల వారీగా ఓటు షేర్‌ చూస్తే, టీడీపీకి 42 శాతం, వైకాపా 44 శాతం, జనసేన 7 శాతం, బీజేపీకి 2 శాతం, కాంగ్రెస్‌ 2 శాతం, ఇతరులు 3 శాతం ఓట్లను షేర్‌ చేసుకుంటారని అభిప్రాయపడింది. లోక్‌సభకు సంబంధించి టీడీపీ 13-15, జనసేన 2, బీజేపీ 4-6 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉండగా, అధికార  వైకాపా 2-4 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments