Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠతకు తెర.. గంటా శ్రీనివాస రావుదే గెలుపు

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (17:07 IST)
ఏపీ శాసనసభ ఎన్నికల్లో భాగంగా విశాఖ ఉత్తరం అసెబ్లీ స్థానంలో మంత్రి హోదాలో గంటా శ్రీనివాస రావు పోటీ చేశారు. అయితే, స్థానం ఫలితాన్ని వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరిగింది. దీనికి కారణం.. ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ ఓట్లకు మధ్య తేడా కనిపించడమే. 
 
ముఖ్యంగా, వీవీ ప్యాట్‌ల ఓట్ల లెక్కింపు సమయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ పోలింగ్ బూత్‌కు సంబంధించిచన వీవీ ప్యాట్‌లో 371 ఓట్లు పోలైతే కేవలం 107 మాత్రమే పోలైనట్టు చూపించాయి. దీంతో వైకాపా అభ్యర్థి కేకే రాజుతో పాటు వైకాపా ఏజెంట్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఫలితాన్ని వెల్లడించడంలో పెంటింగులో పెట్టారు. 
 
ఆ తర్వాత నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆఖరులో ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఫలితాన్ని వెల్లడించారు. ఇందులో గంటా శ్రీనివాసరావు విజయం సాధించినట్టు ప్రకటించారు. అయితే, వైకాపా నేతలు మాత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments