Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం - నాగార్జున సాగర్‌ డ్యాంలను స్వాధీనం చేసుకోండి : ఏపీ

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (10:58 IST)
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెను వివాదంగా మారుతున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేంద్ర సర్కారుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
 
కృష్ణా జలాలను వినియోగించుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం వివాదం చేస్తోందని, సమస్యను పరిష్కరించుకుందామని ఎంత ప్రయత్నించినప్పటికీ, ఘర్షణాత్మక వైఖరి వీడడం లేదని ఆరోపిస్తూ కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేసింది. విభజన చట్టానికి తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించింది. 
 
సాగర్ కుడి కాల్వకు గేట్లు ఆపరేట్ చేస్తున్న సిబ్బంది తెలంగాణకు చెందిన వారు కావడంతో, ఏపీకి సకాలంలో నీటిని విడుదల చేయడం లేదని, దాని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ, కేంద్రానికి తెలిపింది. రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments