Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వలంటీర్లకు రూ.750 ప్రోత్సాహక నగదు : సర్కారు వెల్లడి

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (17:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింద. ప్రస్తుతం అందిస్తున్న రూ.5 వేల నెల వేతనంతో పాటు ఇకపై రూ.750 ప్రోత్సాహక నగదును అందజేయనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం శనివారం వెల్లడించింది. రేషన్ సరకులను ఇంటింటికీ సరఫరా చేస్తూ క్రియాశీలకంగా ఉండటంతో ఈ ప్రోత్సాహక నగదును అందజేయనున్నట్టు తెలిపింద. ప్రతి నెల రూ.750 మొత్తాన్ని సరఫరాల శాఖ ద్వారా వేరేగా అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది. 
 
ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అధ్యక్షతన జరిగిన పౌర సరఫరాల సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రేషన్ సరకులను ఇంటికి చేరవేయడంలో వలంటీర్లను మరింత భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు. అయితే, వలంటీర్లకు ఈ ప్రోత్సాహక నగదు బహుమతిని ఎప్పటి నుంచి అందజేస్తారన్నది తెలియాల్సివుంది. 
 
సీనియర్ నటి జయప్రద మిస్సింగ్.. పోలీసుల గాలింపు? 
 
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కనిపించడం లేదు. దీంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. గత 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు ఆమె హాజరుకావడం లేదు. కోర్టు ఆదేశించినా ఆమె పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆమెకు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ జారీ అయింది. వచ్చే నెల 10వ తేదీన ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఆమె కనిపించకపోవడంతో రాంపూర్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. 
 
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్కినేని దంపతులు 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున దంపతులు శనివారం కలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని సీఎం రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన త్రవాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగానే రేవంత్‌ను అక్కినేని నాగార్జున తన సతీమణి అక్కినేని అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments