Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో 8 వేలకుపైగా కరోనా కేసులు - 88 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (22:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో ఎనిమిదివేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే, 88 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్‌లో విడుదల చేసింది. 
 
గత 24 గంటల్లో 88 మంది మృత్యువాత పడగా, వీరిలో చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పది మంది చొప్పున చనిపోయారు. కర్నూలు జిల్లాలో 9 మంది, నెల్లూరు జిల్లాలో 9 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మృత్యుఘంటికలు మోగించింది. దాంతో మొత్తం మరణాల సంఖ్య 2,650కి పెరిగింది.
 
ఇకపోతే, కొత్త కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పది వేలకు పైగా నమోదవుతున్న తరుణంలో కొన్నిరోజులుగా క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 8,012 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 981 కేసులు వచ్చాయి. 
 
10,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 85,945 మంది చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,829 కాగా, వారిలో 2.01 లక్షలమంది కరోనా నుంచి కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments