Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిషిత్ కారు వేగం 146 కి.మీ.. 0.5 సెకన్ల వ్యవధిలో ప్రమాదం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.నారాయణ కుమారుడు కారు ప్రమాదంపై హైదరాబాద్‌ ఆర్టీఏ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదానికి గురైన సమయంలో నిమిషానికి

Webdunia
శనివారం, 27 మే 2017 (10:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.నారాయణ కుమారుడు కారు ప్రమాదంపై హైదరాబాద్‌ ఆర్టీఏ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదానికి గురైన సమయంలో నిమిషానికి 2.46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇటీవల హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36లో జరిగిన కారు ప్రమాదంలో నిషిత్‌తో పాటు ఆయన స్నేహితుడు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. 
 
ప్రమాదసమయంలో నిషిత్ కారును 200 పైగా కిలోమీటర్ల వేగంతో నడపడం వల్ల ప్రమాదం జరిగినట్టు భావించారు. ఈ ప్రమాదంపై అంతర్గత విచారణ చేపట్టిన ట్రాఫిక్ బృందం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో ఫుటేజీ ఆధారంగా నిషిత్ కారు వేగాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
మెట్రో పిల్లర్‌‌ నెం.8, 9 మధ్య 75 అడుగుల దూరం ఉందనీ, సాధారణంగా సీసీ కెమెరాలో సెకనుకు 24 ఫ్రేమ్స్‌ రికార్డవుతాయి. కానీ నిషిత కారు అతివేగంతో నడపటం వల్ల ప్రమాద సమయంలో 17 ఫ్రేమ్స్‌ మాత్రమే రికార్డయ్యాయి. అంటే, ఆ కారు నిమిషానికి 2.46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తేల్చారు. ప్రమాద సమయంలో కారు 146 కిలోమీటర్ల వేగంతో నడిపారని అంచనా వేశారు. 0.5 సెకను వ్యవధిలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చనే అభిప్రాయానికి వచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments