Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీటు బెల్టు ధరించకపోవడంతో ఛాతికి తీవ్రగాయాలు.. అందుకే నిషిత్ మృతి.. వైద్యులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నిషిత్ మరణంతో నారాయణ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అతివేగంతో పాటు వర్షం పడటం ద్వారా కారు అదుపుతప్

Webdunia
బుధవారం, 10 మే 2017 (13:12 IST)
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నిషిత్ మరణంతో నారాయణ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అతివేగంతో పాటు వర్షం పడటం ద్వారా కారు అదుపుతప్పి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత వేగంతో మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో నిషిత్‌తో పాటు అతని స్నేహితుడు రవి వర్మ మరణించారు. వీరు సీటు బెల్టు ధరించకపోవడంతో వీరిద్దరు మృతి చెందారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన అత్యాధునిక కారులో ప్రయాణించారు. దీని ధర రెండున్నర కోట్లని సమాచారం. ఈ కారు కేవలం 5.4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. యూరో ప్రమాణాలతో ఈ కారు తయారైంది. ఈబీడీ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు అత్యున్నత రక్షణ వ్యవస్థను కలిగిన ఈ కారులో ఏడు గేర్లు ఉంటాయి. 
 
ఇలాంటి అత్యున్నత ప్రమాణాలతో తయారైన కారులో వెళ్ళినా అతివేగం నారాయణ కుమారుడిని పొట్టనబెట్టుకుంది. నిషిత్ నారాయణ, రవివర్మ ప్రయాణించిన కారు  వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అపోలో ఆసుపత్రిలో ఉస్మానియా వైద్యులు పోస్టు మార్టం పూర్తి చేశారు. అతివేగంతోనే వీరి మరణం సంభవించిందని.. మృతులు మద్యం తాగినట్లు ఆనవాళ్లు లేవని తేల్చారు. 
 
ఈ ప్రమాదంలో నిషిత్ ఛాతి, పక్కటెముకలు విరిగాయని తెలిపారు. నిషిత్ డ్రైవింగ్ చేస్తున్నాడని.. బలంగా పిల్లర్‌ను కారు తాకడంతోనే వారు మృతి చెందారని.. రవివర్మ కంటే నిషిత్‌కే ఎక్కువ దెబ్బలు తగిలాయని, ఛాతికి తీవ్ర గాయం కావడంతో నిషిత్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments